English | Telugu

వర్మ, నాగచైతన్య బెజవాడ రౌడీలు ప్రారంభం

వర్మ, నాగచైతన్య "బెజవాడ రౌడీలు" ప్రారంభం అయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ, కిరణ్ కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "బెజవాడ రౌడీలు". నాగచైతన్య "బెజవాడ రౌడీలు" మూవీని వందిత కోనేరు సమర్పిస్తున్నారు. విజయవాడలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న రౌడీ రాజకీయాల మధ్య జరిగే ఆధిపత్యపోరే ఈ చిత్రం కథాంశం అని తెలుస్తున్నది.

నాగచైతన్య "బెజవాడ రౌడీలు" సినిమా ఇటీవల విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ మే నెల 27 వరకూ విజయవాడ, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అనంతరమ జూన్ లో, ఆగస్టులో నాగచైతన్య "బెజవాడ రౌడీలు" మూవీ షూటింగ్ పూర్తిచేసి అక్టోబర్ లో దసరా పరవదినం సందర్భంగా రిలీజ్ చేయటానికి ఈ చిత్రం యునిట్ సన్నాహాలు చేస్తోంది. తండ్రి యువసామ్రాట్ అక్కినేని నాగార్జునతో "శివ" వంటి ట్రెండ్ సెట్టర్ సినిమా తీసిన రామ్ గోపాల వర్మ అతని కొడుకు నాగచైతన్యతో నిర్మిస్తున్న "బెజవాడ రౌడీలు" కూడా ఆ రేంజ్ లో హిట్ చేయగలదో...లేడో....వేచి చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.