English | Telugu

దాస‌రికి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ కౌంట‌ర్‌...

బండ్ల గ‌ణేష్ మాట తీరుకు చాలామంది ఫ్యాన్స్ అయిపోతారు. వేదిక ఎక్కితే, మైకు ప‌ట్టుకొంటే మైకం వ‌చ్చేస్తుంది. ఆయ‌న ముందు... మాట‌ల మాంత్రికులు కూడా ప‌నిచేయ‌రు. పంచ్‌లు వ‌రుస క‌ట్టేస్తాయి. ప‌వ‌న్‌ని పొగడాలంటే గ‌ణేష్ త‌ర‌వాతే ఎవ‌రైనా. ఇప్పుడు చిరంజీవి నామాన్ని స్మ‌రిస్తున్నాడు. గ‌ణేష్ ఫ్ర‌స్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. స‌డ‌న్‌గా అన్న‌య్య గుర్తొచ్చాడేమో.. ఇలా ట్వీట్ల వ‌ర్షం కురిపంచాడు..

రాముడు లేని రామాయణమ్ చదవం. చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం. కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్థార్. రామారావుగారు నాగేశ్వరరావుగారు కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెంబర్-వన్ అయ్యి మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన మెగాస్టార్ చిరంజీవి. తెలుగువారి క్యాలెండర్లో పండగలు ఉంటే తెలుగు సినీపరిశ్రమ కాలెండర్లో చిరంజీవిగారి సినిమా రిలీజ్ డేట్స్ ఉంటాయి. డాన్సు నేర్చుకోవాలంటే ఫైట్స్ ప్రాక్టిస్ చెయ్యాలంటే నడవాలంటే నిలబడాలంటే చూసే మెగాస్టార్ చిరంజీవిగారి సీడీలనే చూడాలి కాదా. చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటాం. బాక్సాఫీసుని రీ డిఫైన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నించి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా. ఈ పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం. మెగాస్టార్ జిందాబాద్. జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ...

అంటూ చిరుని తెగ పొగిడి పారేశాడు. స‌డ‌న్‌గా చిరుపై గ‌ణేష్‌కి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో. కొంప‌దీసి 150వ సినిమా ఛాన్స్ నీకే అని మాటిచ్చాడో ఏమో..?? ఆదివారం జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్లో స్టైల్ అంటే ప‌వ‌న్‌దే అంటూ దాస‌రి నారాయ‌ణ‌రావు చేసిన కామెంట్ల‌కు ఇది కౌంట‌ర్ అని మెగా అభిమానులు చెప్పుకొంటున్నారు. మొత్తానికి బండ్ల దాస‌రిపైనే బాణం ఎక్కు పెట్టాడ‌న్న‌మాట‌.