English | Telugu
ఇది నందమూరి నామ సంవత్సరమేనా?
Updated : Jan 3, 2015
బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు 2015లో తమ ప్రతాపం చూపించబోతున్నారు. లెజెండ్‌తో మాంఛి ఫామ్ లో ఉన్న బాలయ్య 2015లో లయన్ గా విజృంభించడానికి రెడీ అయ్యాడు. ఇక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ ఈసారి ఎలాగైనా తన టెంపర్ చూపించాలనుకొంటున్నాడు. బాక్సాపీసు దగ్గర ఈసారైనా తన మార్క్ చూపించాలని పటాస్ హీరో కల్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ముగ్గురి సినిమాలూ వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. డిసెంబరు 31 అర్థరాత్రి తమ టీజర్లతో బాలయ్య, ఎన్టీఆర్ హంగామా సృష్టిస్తే... మరుసటి రోజు ఆడియోని విడుదల చేశాడు కల్యాణ్ రామ్. లయన్, టెంపర్ టీజర్లు ఎంత హాట్ గా ఉన్నాయో, పటాస్ పాటలూ, ప్రచార చిత్రాలూ అంతే హాట్ గా ఉన్నాయి. ఇది వరకు కల్యాణ్ రామ్ సినిమాలకు లేనంత క్రేజ్ ఒక్కసారిగా పటాస్‌కి వచ్చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్‌కి మరోసారి అతనొక్కడే లాంటి ఫలితం దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్టీఆర్ కీ హిట్ దక్కితే.. 2015 నందమూరి హీరోలదే. అన్నట్టు బాలయ్య తన 100వ సినిమాకీ 2015లోనే శ్రీకారం చుట్టబోతున్నాడు. అన్నీ కదిరితే మోక్షజ్ఞ ఎన్నీ కూడా ఖాయమవ్వొచ్చు. మొత్తానికి 2015 మాత్రం నందమూరి హీరోలదే. ఇంకెందుకు ఆలస్యం.. నందమూరి అందగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పేయండి.