English | Telugu

ఇరవై రోజుల్లో రజనీకాంత్, బాలకృష్ణ చరిత్ర సృష్టిస్తారా?

వరుస హిట్లతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్, 'పద్మభూషణ్ బాలకృష్ణ'(Balakrishna)ప్రస్తుతం 'అఖండ 2(Akhanda 2)'చేస్తున్న విషయం తెలిసిందే. విజయదశమి(Vijaya Dasami)కానుకగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో దర్శకుడు బోయపాటి శ్రీను శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ బోయపాటి, బాలయ్య కాంబోలో సింహ, లెజండ్, అఖండ వంటి బ్లక్ బస్టర్ హిట్స్ ఉండటంతో అఖండ 2 పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోభారీ అంచనాలు ఉన్నాయి.

ఇక అఖండ 2 తర్వాత బాలయ్య చెయ్యబోయే సినిమాల్లో 'జైలర్ పార్ట్ 2 (Jailer 2) కూడా ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. రజనీ(Rajinikanth)తో కలిసి జైలర్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బాలయ్య, ఈ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని, పార్ట్ 1 లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కనపడిన తరహాలో ఆ క్యారక్టర్ ఉండబోతోందనే కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జైలర్ 2 కోసం బాలయ్య ఇరవై రోజులు కాల్షీట్స్ ఇచ్చాడనే వార్త ఒక రేంజ్ లోనే వినిపిస్తుంది. దీంతో ఇరవై రోజులు కాల్షీట్స్ అంటే జైలర్ 2 లో బాలయ్యది గెస్ట్ రోల్ కాదని, సినిమా ఆసాంతం కనపడడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.

అసలు జైలర్ 2 లో బాలయ్య చేయడం లేదని, అదంతా ఒట్టి రూమర్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా బాలయ్య, రజనీ కాంబో సిల్వర్ స్క్రీన్ పై కనపడితే చూడాలని ఇరువురు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే జైలర్ 2 ఒక చరిత్ర సృష్టించే సినిమా అవుతుందనేది వాళ్ళ నమ్మకం. 2023 లో వచ్చిన జైలర్ రజనీని వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు నెల్సన్ కుమార్(Nelson Dilip Kumar)కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు జైలర్ 2 స్క్రిప్ట్ రెడీ అయ్యిందని, సౌత్ కి సంబంధించిన ఒక బడా హీరో కూడా చేస్తున్నాడని వెల్లడి చేసాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.