English | Telugu

రెండు కాలాల్లోను బాలయ్య టాప్! 

'గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ'(Balakrishna)వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే మరో బ్లాక్ బస్టర్ ని అందుకునేందుకు 'బోయపాటి శ్రీను'(Boyapati Srinu)దర్శకత్వంలో 'అఖండ పార్ట్ 2'(Akhanda 2)ని సిద్ధం చేస్తున్నాడు. డెవోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ అఖండ కి సీక్వెల్ కావడంతో, ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విజయదశమి(Vijayadasami)కానుకగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని(Tejaswini),14 రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకోనుంది.

ఇక అఖండ 2 తర్వాత బాలకృష్ణ ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా 'గోపిచంద్ మలినేని'(Gopichand Malineni)దర్శకత్వంలో మూవీకి రెడీ అవుతున్నాడు. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'వీరసింహారెడ్డి' లాంటి ఫ్యాక్షన్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్ కమింగ్ మూవీ ఎటువంటి కథతో తెరకెక్కబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న 'వర్తమానానికి, గత చరిత్రని ముడిపడుతు' ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రం రూపొందనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే బాలయ్య రెండు కాలాలు,రెండు క్యారక్టర్ లలో కనిపించనున్నాడు. బాలయ్య లుక్ కూడా కొత్తగా ఉండటంతో పాటు, పోరాట ఘట్టాలు భారీ స్థాయిలో ఉండబోతునట్టుగా తెలుస్తుంది. నవంబర్ నుంచి షూట్ కి వెళ్లనుందని, బాలకృష్ణ కెరీర్ లోనే ఇంతవరకు తెరకెక్కని హై బడ్జెట్ తో తెరకెక్కబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది.

బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన 'ఆదిత్య 369'(Aditya 369 )సైన్స్ ఫిక్షన్ సబ్జెట్ తో తెరకెక్కింది. రెండు కాలాలని ఈ చిత్రంలో చూపించగా,శ్రీకృష్ణదేవరాయలు క్యారక్టర్ లో బాలయ్య 'నభూతో న భవిష్యత్తు' అనే రీతిలో నటించారు. దీంతో ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చెయ్యబోయే మూవీకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)తో 'పెద్ది'ని నిర్మిస్తున్న'వృద్ధి సినిమాస్ అధినేత 'సతీష్ కిలారు'(Satish kilaru)ఈ చిత్రాన్నిబాలయ్య కెరీర్ లోనే అత్యంత హైబడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.