English | Telugu

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఘనంగా వేడుక!

1974 ఆగష్టు 30న విడుదలైన తెలుగు చిత్రం "తాతమ్మ కల"తో నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. 50 ఏళ్ల తర్వాత కూడా హీరోగా కొసగడమే కాకుండా, హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్నారు. 50 ఏళ్లుగా వైవిధ్యమైన పాత్రల్లో హీరోగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు నందమూరి బాలకృష్ణ. ఆయన గోల్డెన్ జూబ్లీ సినీ హీరో. రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో-బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్స్ కు ఆయన ఛైర్మన్ గా ఉన్నారు. ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఆయన చేసిన అవిశ్రాంత కృషి మరువలేనిది, ఇక్కడ కేవలం భారతదేశం నుండి వచ్చిన రోగులు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారు. బాలకృష్ణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా అలాగే ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.

నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. సెప్టెంబరు 1న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సన్మానం చేయబోతోందనీ, అందుకు అంగీకరించాల్సిందిగా అభ్యర్ధించారు. వారి అభ్యర్థనను బాలకృష్ణ అంగీకరించారు. భారతీయ సినిమా మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సన్మాన సభలో పాల్గొంటారు. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రెస్ నోట్ విడుదల చేసింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.