English | Telugu
టాలీవుడ్ లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!
Updated : May 25, 2025
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రంగస్థల కళాకారుడు, నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. (Actor GV Babu)
2023లో విడుదలైన 'బలగం' చిత్రం ప్రేక్షకుల మెప్పుతో పాటు, విమర్శల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాలో కథకి కీలకమైన చిన్నతాత పాత్ర పోషించి మెప్పించారు జీవీ బాబు.
జీవీ బాబు మృతి పట్ల బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. "జి.వి. బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను." అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.