English | Telugu

సెంటిమెంట్ ఎక్కువైంది రాజ‌మౌళీ..

బాహుబ‌లి సెన్సార్ అయిపోయింది. సినిమా ఎలా ఉండ‌బోతోంది? హైలెట్స్ ఏంటి? అనే విష‌యాల‌పై కాస్త కాస్త క్లూలు అందుతున్నాయి. ఇన్‌సైడ్ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం... బాహుబ‌లిలో సెంటిమెంట్ పాళ్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. మొద‌టి 20 నిమిషాలూ భారంగా గ‌డుస్తాయని.. ఆయా సన్నివేశాల్లు రాజ‌మౌళి గుండెల్ని పిండేశాడ‌ని చెప్పుకొంటున్నారు.

బాహుబ‌లి అన‌గానే యుద్దం, వీర‌త్వం, అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫైట్స్ లాంటివి ఆశించే వాళ్లంతా దాదాపు 20 నిమిషాల పాటు ఈ సెంటిమెంట్ సీన్ల‌ను భ‌రిస్తారా అనేది అనుమానంగా త‌యారైంది. అయితే ఈ సినిమా మొత్తం విజువ‌ల్ ట్రీట్ అని తెలుస్తోంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ మొత్తం అదిరిపోయింద‌ని స‌మాచారం. దాంతో పాటు యుద్దం ఎపిసోడ్ ఈ సినిమాకి హైలెట్ అని తెలుస్తోంది.

ఇంట్ర‌వెల్‌, వార్ ఎపిసోడ్లే ఈ సినిమాని నిల‌బెట్టాయ‌ని.. మిగిలిన సినిమా అంతా ప‌క్కా రాజ‌మౌళి త‌ర‌హా రివైంజ్ డ్రామాలా సాగుతుంద‌ని టాక్‌. ఫ‌స్టాఫ్ నిడివి మొత్తం 2గంట‌ల 35 నిమిషాలు. అందులో ప‌ది నిమిషాల పాటు ట్రిమ్ చేయాల‌ని రాజ‌మౌళి డిసైడ్ అయ్యాడ‌ట‌. ఆ ప‌ది నిమిషాలూ సెంటిమెంట్ సీన్ల‌యితే.. ప్రేక్ష‌కుల‌కు భారీ రిలీఫ్ దొరికినట్టే. ఏం చేసినా జులై 10లోపే చేయాలి. ఆ త‌ర‌వాత‌... ఎన్ని హంగులు దిద్దినా, ఎన్ని ట్రిమ్మింగులు చేసినా లాభ‌మేముంటుంది?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.