English | Telugu

అక్టోబర్ 25న 'బాహుబలి' వచ్చేస్తోంది..!!

వెండితెరపై రికార్డుల దుమ్ముదులిపిన 'బాహుబలి' ఇప్పుడు బుల్లి తెర పై కూడా స‌త్తా చాట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. దాదాపు 18 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి సినిమా శాటిలైట్ లైట్ హ‌క్కుల‌ను మాటీవి ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే క‌మింగ్ సూన్ అంటూ టీ.వి సీరియళ్ల మ‌ధ్య‌లో వాయించేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 25న ఈ మూవీని బుల్లితెరపై ప్రసారం చేయనున్నారని అంటున్నారు. అయితే ఇంత భారీ ధ‌ర‌కు శాటిలైట్ ద‌క్కించుకున్న మా టీవి మొత్తం యాడ్ ల ద్వారా పిండేయాల‌ని చూస్తుంది. అందుకే సినిమా మ‌ధ్య‌లో వ‌చ్చే ఒక్కో యాడ్ అక్ష‌రాలా రెండు ల‌క్ష‌ల యాభై వేలట‌. నిడివి 10 సెకెన్లు మాత్ర‌మే.

అదే స‌మ‌యంలో షూటింగ్ అనుభ‌వాల‌ను యూనిట్ బుల్లి తెర ప్రేక్ష‌కుల‌తో పంచుకోనుంది. దానికి సంబంధించిన షూట్ కూడా ఇప్ప‌టికే ఫినిష్ అయిపోయింద‌ని అంటున్నారు. ఆ రోజుకు ముందు అంటే 24న సినిమా మేకింగ్, ఇంటర్వ్యూలను సుమారు రెండు గంటలపాటు మాటీవిలో టెలికాస్ట్ చేయ‌నున్నారు. బాహుబ‌లి విడుద‌లై మూడు నెల‌ల కూడా గ‌డ‌వ‌క ముందే బుల్లి తెరపై రావడం ఆసక్తికరంగా వుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.