English | Telugu

ఆంధ్రా, తెలంగాణాలో 'బాహుబలి' కలెక్షన్ల సునామి

రాజమౌళి బాహుబాలి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూ, బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళుతుంది. మొదటి వారం తరువాత ఈ సినిమా కలెక్షన్లు నెమ్మదిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేసాయి. అయితే బాహుబలి అందరి అంచనాలను తిప్పికొట్టి రెండో వారంలో కూడా అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది. ఆంధ్ర, తెలంగాణలో మాత్రం ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతోంది. రెండో వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా కేవలం ఆంధ్రా, తెలంగాణాలో 87.1 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ కలెక్షన్ల చరిత్రను తిరగరాసింది. 'బాహుబలి' ఆంధ్రా, తెలంగాణా కలెక్షన్ల వివరాలు మీ కోసం:

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో 'బాహుబలి' ఏరియాల వారీ కలెక్షన్స్( షేర్ )

నైజాం Rs 32.09 crore

సీడెడ్ Rs 17.7 crore

వైజాగ్ Rs 7.49 crore

గుంటూరు Rs 7.80 crore

కృష్ణా Rs 5.44 crore

ఈస్ట్ గోదావరి Rs 7.23 crore

వెస్ట్ గోదావరి Rs 6.05 crore

నెల్లూరు Rs 3.30 crore

టోటల్ Rs 87.1 Crore (ఆంధ్రా, తెలంగాణ షేర్ )

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.