English | Telugu

బాహుబ‌లివ‌న్నీ బిల్డ‌ప్పులే..!



ఇండియ‌న్ అవ‌తార్‌
మాయాబ‌జార్ త‌ర‌వాత మ‌ళ్లీ అలాంటి క్లాసిక్‌
ఇండియాస్ బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్‌..
- ఆహా... ఇలాంటి బిల్డ‌ప్పుల‌కేం త‌క్కువ చేయ‌లేదు. టీమ్ లో ఎవ‌రిని క‌దిపినా..
`ఇలాంటి సినిమా జీవితానికి ఒక్క‌సారేనండీ` అనేసేవారు. సినిమా గురించి ఏం మాట్లాడ‌కుంటేనే అన్నో ఇన్నో ఊహించేసుకొని థియేట‌ర్‌కెళ్తుంటారు జ‌నాలు. ఇక మేమే క్లాసిక్ తీశామంటే ఇక ఆగుతారా?? హ‌ద్దుల‌న్నీ చెరిపేసి మ‌రీ ఊహించేసుకొంటారు. ఇవి చాల‌ద‌న్న‌ట్టు అమితాబ్ నుంచి స‌ల్మాన్ ఖాన్ వ‌ర‌కూ, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ బాహుబ‌లిని పొగడ‌ని వాడెవ్వ‌డూ లేడు. సినిమా రాక‌ముందే.. 'అద్భుతం.. క్లాసిక్‌' అని ప‌నిగ‌ట్టుకొని మ‌రీ కితాబులిచ్చేశారు. తీరా చూస్తే... బాహుబ‌లి `జ‌స్ట్ ఓకే` సినిమా అనిపించడం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మూడేళ్లు క‌ష్ట‌ప‌డింది, వంద‌ల కోట్లు వ‌చ్చించింది ఇందుకా..? అనిపిస్తోందిప్పుడు..

బాహుబ‌లిని ఇప్ప‌టి కిప్పుడు పోస్ట్ మార్టం చేస్తే.. బోలెడ‌న్ని అవ‌ల‌క్ష‌ణాలు పుట్ట‌గొడుగుల్లా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. ముఖ్యంగా క‌థార‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాసింది.. ఓ మామూలు క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌. దానికి భారీ హంగులు జోడించాడంతే. ఇంత సినిమా తీసినా, ఇండియ‌న్ అవ‌తార్ అని చెప్పుకొన్నా.. మామూలు క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని ఏమాత్రం మ‌ర్చిపోకుండా ఎడా పెడా వాడేసుకొన్నాడు రాజ‌మౌళి. మ‌ధ్య‌లో ఇరికించిన ఐటెమ్ పాటే అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఫ‌స్టాఫ్‌లో అవంతిక త‌న త‌నువును శివుడికి అప్పగించేసే సీన్‌... ప‌క్కా క‌మ‌ర్షియాలిటీ. అస‌లు అవంతిక ఎవ‌రు? ఓ గొప్ప ల‌క్ష్యం కోసం పోరాడుతున్న వీర‌నారి. ఓ మ‌గాడు త‌న‌కు తెలియ‌కుండా చేతిపై ప‌చ్చ‌బొట్టు వేస్తే.. దానికి క‌డివెడు క‌న్నీళ్లు పెట్టుకొన్న ఓ వీర‌నారి... ప్రేమిస్తున్నా అంటూ వెంట‌ప‌డిన అబ్బాయికి త‌న `స‌ర్వ‌స్వం` క్ష‌ణాల్లో అర్పించేస్తుంది. అక్క‌డ అవంతిక పాత్ర ఔచిత్యం ఎక్క‌డికి పోయింది..??

భ‌ల్లాల‌దేవ‌కిచ్చిన బిల్డ‌ప్పులు అన్నీ ఇన్నీ కావు. `అస‌లు ఇండియ‌న్ స్ర్కీన్ పైనే ఇంత పెద్ద విల‌న్ ని చూడ‌లేదు..` అన్నారు. అస‌లు ఈ సినిమాలో విజ‌నిజం ఎక్క‌డుంద‌ని? కాల‌కేళ‌గా క‌నిపించిన ప్ర‌భాకరే క‌దా అస‌లు విల‌న్‌. నాజ‌ర్ పాత్ర‌ని స‌రిగ్గా వాడుకొన్నాడా? క‌ట్ట‌ప్ప పాత్ర‌ని ఎందుక‌లా డ‌మ్మీగా మార్చారు? అస‌లు సుదీప్ క్యారెక్ట‌ర్ ఈ సినిమాకి అవ‌స‌ర‌మా? క‌న్న‌డ‌లో ఈ సినిమాని రిలీజ్ చేసుకోవ‌డానికి త‌ప్ప‌...?? అనుష్క కోసం ఈ సినిమాకి వెళ్తే నిరాశ‌ప‌డ‌డం మాత్రం ఖాయం. ఆ మేక‌ప్ క‌థ‌కు అవ‌స‌ర‌మే కావ‌చ్చు.. కానీ భ‌రించ‌లేం. అనుష్క ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ఎందుకు ఎగ్గొట్టేసిందో దేవ‌సేన పాత్ర‌ని చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో మాకు ఎన‌ర్జీ ఇచ్చిన పాత్ర ఏదైనా ఉంటే.. అది శివ‌గామి పాత్రే అన్నారంతా. కానీ అంత సీన్ ఆ పాత్ర‌కు లేకుండా పోయింది. రమ్య‌కృష్ణ న‌ట‌న‌లో పీక్స్ చూడాలంటే న‌ర‌సింహ సినిమానే. అందులోని న‌ట‌న‌తో పోలిస్తే.. శివ‌గామి ఎంత‌ని..?? ఇలా ఒక్క‌ట‌ని కాదు.. ఈ సినిమాలో క‌నిపించే ప్ర‌తి పాత్ర హాఫ్ బాయిల్డే.

ఈ సినిమాకి ప్ర‌ధానమైన ప్రాణం... యుద్ద స‌న్నివేశాలు. ఈ సీన్స్‌కి వంద రోజుల పాటు, యాభై కోట్ల ఖ‌ర్చుతో తెర‌కెక్కించార‌ట‌. వార్ ప్లాన్స్‌, ఈ సీన్ల‌కు ఇచ్చిన ముంద‌స్తు బిల్డ‌ప్పులు ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి. వార్ సీన్‌లో కొన్ని షాట్స్ అద్భుతం అనిపిస్తాయి. కానీ.. రాన్రానూ ఈ వార్ ఎప్పుడు అయిపోతుంది రాబాబూ అనిపిస్తుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో మ‌హిష్మ‌తీ సామ్యాజ్యాన్ని సృష్టించారు. ఓకే. అయితే ఆ సామ్రాజ్యం తొలిసారి చూసిన ఫీలింగ్ ప్ర‌తిసారీ క‌ల‌గ‌దు. తెర‌పై ఏది విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఏది కాదో ప్రేక్ష‌కుడు సుల‌భంగా ఓ అంచ‌నాకు వ‌చ్చేస్తున్నాడు. అలాంట‌ప్పుడు అవేం పెద్ద‌గా థ్రిల్ క‌లిగించ‌దు. అడ‌వి దున్న‌తో రానా చేసిన ఫైట్‌.. చాలా మామూలుగా ఉంది. అది వీ ఎఫ్ సీన్ అని తెర‌పై రాసేశారు...దాంతో క‌లిగిన కాస్త ఫీల్ కూడా ఎగిరిపోతుంది. జాన‌ప‌ద‌, పౌరాణిక చిత్రాలు తెలుగులో ఎన్నో వ‌చ్చాయి. క‌త్తి యుద్దాలు ఎన్టీఆర్‌, కాంతారావు హ‌యాంలోనే తీశారు. రాజ‌కోట ర‌హ‌స్యం లాంటి సినిమాల్ని ఇప్పుడు చూసినా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అవ‌న్నీ రోజుల్లో తీసిన సినిమాలు. ఈ సినిమాలో ఒక్క యుద్ద స‌న్నివేశానికే 100 రోజులు కేటాయించారు. ఇప్పుడు విజువ‌ల్ ఎఫెక్ట్స్ పెరిగాయి. అలాంట‌ప్పుడు వార్ ఎపిసోడ్ మ‌రో రేంజులో ఉండాలి. కానీ.. ఆ విష‌యంలోనూ ఈ సినిమా నిరాశ‌ప‌రిచింది.

ఈ సినిమాకి ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ హైపే... ఇప్పుడు ఆ హైపే బాహుబ‌లి కొంప ముంచింది. మ‌గ‌ధీర‌, ఈగ వ‌చ్చిన‌ప్పుడు ఇంత హైప్ లేదు. అస‌లు ఆయా సినిమాల గురించి రాజ‌మౌళి ఎప్ప‌డూ పెద‌వి విప్ప‌లేదు. అందుకే మ‌గ‌ధీర‌లో వంద మందిని చంపే ఎపిసోడ్ చూసి షాక్ తిన్నారు జ‌నాలు. అందులోని ఎఫెక్ట్స్ చూసి వారెవా అనుకొన్నారు. ఈగ కూడా అంతే. అయితే బాహుబ‌లి అలా కాదు. ముందే.. క్లాసిక్ క్లాసిక్ అంటూ కాకి కూత‌లు కూశారు. దాంతో ఆశ‌లు పెరిగాయి. ఇప్పుడు తెర‌పై బొమ్మ చూసి ప్రేక్ష‌కుడికి దిమ్మ తిరిగిపోతోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.