English | Telugu

ఆపై వచ్చే క్రిస్మస్‌కి ‘అవతార్-2’

ప్రపంచ సినిమా సంచలనం, హాలీవుడ్ మూవీ, జేమ్స్ కామెరాన్ తెరకు ఎక్కించిన గొప్ప సినిమా ‘అవతార్’. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా సీక్వెల్ ‘అవతార్-2’ని 2017 క్రిస్మస్‌కి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ మేరకు జేమ్స్ కామెరాన్ ఈ విషయాన్ని ప్రకటించారంటూ అమెరికాకి చెందిన పలు వెబ్‌సైట్లు కథనాలను ఇచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయిందని, 2017 సంవత్సరం క్రిస్మస్ నాటికి ఈ సినిమాని విడుదల చేయడం ఖాయమని సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.