English | Telugu

మీకు, అతనికి ముప్పై ఏళ్ళ వయసు తేడా ఉంది.. అయితే తప్పేంటి


-అయితే ఏమవుతుంది
-ఆషికా రంగనాధ్ ధీటైన జవాబు
-రవితేజ, చిరంజీవి తో హంగామా


ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆమెని ఆపడం ఎవరి తరం కాదు. ఆపాలనే ప్రయత్నాలు చేసినా, సదరు ప్రయత్నాల్నిఆమెకే పాజిటీవ్ గా మారి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తాయి. సినీ రంగం పుట్టిన దగ్గరనుంచి ఈ సూత్రం అప్లై అవుతు వస్తుంది. ఇప్పుడు అలాంటి టైం 'ఆషికా రంగనాధ్'(Ashika Ranganath)కి రాబోతుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె అప్ కమింగ్ సినిమాల లైనప్ కూడా ఆ విధంగానే ఉంది. మెగాస్టార్ 'విశ్వంభర'(Vishwambhara),మాస్ మహారాజ రవితేజ(Raviteja)భర్త మహాశయులకి విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Vignapthi)ఆషికా ఖాతాలో ఉన్నాయి. ఈ రెండిటిలో ముందుగా భర్త మహాశయులకి విజ్ఞప్తి వచ్చే సంక్రాంతికి సందర్భంగా జనవరి 13 న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆషికా తన కంటే వయసులో ముప్పై సంవత్సరాల వయసు తేడా ఉన్న హీరోల సరసన జత కడుతుందనే చర్చ జరుగుతుంది. కొంత మంది నెటిజెన్స్ అయితే ఏకంగా ట్రోల్ల్స్ కూడా చేస్తున్నారు.

ఇప్పుడు వాటన్నిటి గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆషికా మాట్లాడుతు సినిమాకి సంబంధించి నటిగా నా క్యారక్టర్ కి ఎంతవరకు న్యాయం చేస్తున్నాను అనేదే చూస్తాను. అంతేకాని యంగ్ హీరోనా, సీనియర్ హీరోదా అనేది ముఖ్యం కాదు. పెద్ద నటులతో వర్క్ చెయ్యడం నా అదృష్టం. సీనియర్ హీరోలతో పనిచేస్తే కెరీర్‌కి సంబంధించి ఎన్నో కొత్త విషయాలని నేర్చుకోవచ్చు. వారి అనుభవం మనకి ఒక లెసన్ లా పనిచేస్తుంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా, నటనకు స్కోప్ ఉన్న వాటికే ఓటు వేస్తాను. నాగార్జున గారితో నా సామి రంగలో కూడా చేశాను. ఆయన సెట్స్‌లో చూపించే ఎనర్జీ, డెడికేషన్ చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. దీంతో ట్రోల్స్ కి సరైన సమాధానం చెప్పిందంటూ అభిమానుల నుంచి కామెంట్స్ వినపడుతున్నాయి.


Also Read:వాళ్ళ నిజస్వరూపాలు నాకు తెలుసు.. రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు


కన్నడ చిత్ర సీమకి చెందిన ఆషికా 2016 లో క్రేజీ బాయ్ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత కన్నడలో సుమారు పది చిత్రాల వరకు చేసిన ఆషిక 2023 లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ తో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యింది ప్రస్తుతం తమిళంలో కూడా 'కార్తీ' తో సర్దార్ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.