English | Telugu

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ లో బిగ్ స‌ర్‌ప్రైజ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తల్లీకొడుకుల కథతో తెరకెక్కుతోన్న ఈ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రంలో.. వైజయంతిగా విజయశాంతి, అర్జున్ గా కళ్యాణ్ రామ్ అలరించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. (Arjun Son Of Vyjayanthi)

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ వచ్చింది. ర‌న్ టైమ్‌ ను 2 గంట‌ల 24 నిమిషాలకు లాక్ చేశారు. ఈ మూవీ సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉంది. యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా మలిచారట. ముఖ్యంగా కళ్యాణ్ రామ్-విజయశాంతి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయని.. ఈ సీన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడం ఖాయమని అంటున్నారు. అలాగే, క్లైమాక్స్ బిగ్ స‌ర్‌ప్రైజ్ అని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ సైతం ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొత్తానికి మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే కంటెంట్ తో వస్తున్న కళ్యాణ్ రామ్.. ఈ వేసవికి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.