English | Telugu

అనుష్క, రానా ఫోన్ కాల్... పెళ్ళికి వెళ్లడం లేదు 

హీరోలోతో పాటు సమానంగా ఇమేజ్ ని సంపాదించుకోవడంతో పాటు, హీరోలకి ధీటుగా లాంగ్ రన్ ని కొనసాగిస్తున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో 'అనుష్క'(Anushka)ఒకటి. ఈ నెల 5 న 'ఘాటీ'(Ghaati)తో థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. యాక్షన్, క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న 'ఘాటీ' లో షీలావతి గా అనుష్క తన నట విశ్వరూపాన్ని మరోసారి చూపించనుంది. హరిహరవీరమల్లు తర్వాత దర్శకుడు క్రిష్(Krish)నుంచి వస్తున్న మూవీ కావడం, ట్రైలర్ కూడా అదిరిపోవడంతో 'ఘాటీ' పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక రిలీజ్ డేట్ కి ముహూర్తం దగ్గర పడనుండటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అందులో భాగంగా వర్సటైల్ నటుడు, హీరో రానా, అనుష్కతో ఫోన్ లో ఇంటర్వ్యూ చేసాడు. ఈ సందర్భంగా అనుష్క ఘాటీ గురించి మాట్లాడుతు '. బాహుబలి, అరుంధతి చిత్రాల సరసన 'ఘాటీ' నిలుస్తుందనే నమ్మకం ఉంది. మూవీలో ఉన్న హింసని పక్కన పెడితే, ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితులకి ఈ చిత్ర కథ సూటవుతుంది. క్రిష్ గారు నాకెప్పుడూ మంచి క్యారెక్టర్స్ ని ఇస్తారు. వేదంలో ని సరోజ ఎలా గుర్తిండిపోయిందో, ఘాటీ లోని షీలావతి కూడా అదే విధంగా గుర్తిండిపోతుంది. ఆంధ్రా,ఒడిశా బోర్డర్ దగ్గర షూటింగ్ జరిగిందని చెప్పుకొచ్చింది.

అనంతరం రానా మాట్లాడుతు ఇకపై ఇలానే మూడేళ్ళకి సినిమా చేస్తావా, మనం కలిసి సుమారు పదేళ్లు అవుతుందని అన్నాడు. ఆ ప్రశ్నకి బదులిస్తు 'వచ్చే ఏడాది నుంచి కంటిన్యూగా సినిమాలు చేస్తాను. నేను ఎవర్ని కలవడం లేదు. మా ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకి కూడా వెళ్లడం లేదు. అందరు ఎప్పుడు కనిపిస్తావు అని అడుగుతున్నారు. త్వరలోనే అందరి ముందుకు వస్తానని బదులు ఇచ్చింది. అనుష్క గత కొంత కాలంగా మీడియా ముందుకు రావడం లేదు. ఆ ఒప్పందంతోనే 'ఘాటీ' ని చేసింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.