English | Telugu

ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా నాగార్జున బంపర్ ఆఫర్ 

తెలుగు సినిమా జననం, నటసామ్రాట్, ఎవర్ గ్రీన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత 'అక్కినేని నాగేశ్వరరావు'(ANR)గారి సినీ రంగ ప్రవేశం ఇంచు మించు ఒకేసారి జరిగిందని చెప్పవచ్చు. ఆయనతో పాటే తెలుగు సినిమా కూడా ఎదిగింది. ఏడున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం 'ఏఎన్ఆర్' సొంతం. దీన్ని బట్టి నటనా రంగంలో ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. జానపద, పౌరాణిక,సాంఘిక, భక్తి రసచిత్రాల్లో ఆయన పోషించని క్యారక్టర్ లేదు. ఎన్నో అద్భుతమైన క్యారక్టర్ లు నేటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో పదిలంగా ఉన్నాయి..

ఏఎన్ ఆర్ 101 వ జయంతి సెప్టెంబర్ 20 న జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వారసుడు కింగ్ 'నాగార్జున'(Nagarjuna)తన తండ్రి నటించిన ఎన్నో మరుపురాని చిత్రాల్లోని డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం సినిమాలని అభిమానులతో పాటు,ప్రేక్షకుల కోసం రెండు తెలుగు రాష్టాల్లో విడుదల చేస్తున్నారు. కాకపోతే వీటిని ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్ వివరాలు 'బుక్ మై షో' లో అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం కూడా నాగార్జున ఈ అవకాశాన్ని కలిపించిన విషయం తెలిసిందే.

దీంతో థియేటర్స్ లో 'ఏఎన్ఆర్' అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ సంవత్సరం కూడా అంతకు మించిన కోలాహలం నెలకొని ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పటిలాగానే రెండు రాష్ట్రాల్లో ఉన్నఅభిమానులు 'ఏఎన్ఆర్' జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా జరపనున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.