English | Telugu

ఆంధ్ర కింగ్ తాలూకా ఓటిటి డేట్ ఇదే 

-ఈ సారి పాన్ ఇండియా ప్రేక్షకులకి పండగే
-నెట్ ఫ్లిక్స్ వెల్లడి
-పెర్ ఫార్మెన్స్ విషయంలో తగ్గేదేలే

రామ్ పోతినేని(Ram Pothineni),భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse)జంటగా తెరకెక్కిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka)గత నెల 27 న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ కామెడీ మూవీగా తెరకెక్కగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ పోతినేని పెర్ఫార్మ్ ఒక రేంజ్ లో సాగుతుంది. ముఖ్యంగా తాను అభిమానుంచే హీరోకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రేయసిని సైతం వదులుకోవడానికి సిద్దపడటంతో పాటు, తన ఊరి బాగుకోసం పరితపించే వ్యక్తిగా సాగర్ క్యారక్టర్ లో రామ్ జీవించాడని చెప్పవచ్చు.


ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నట్టుగా సదరు సంస్థ అధికారంగా వెల్లడి చేసింది. ఓటిటి మూవీ లవర్స్ కి ఆనందం కలిగించే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ అందుబాటులో ఉంచనుంది. దీంతో పాన్ ఇండియా ఓటిటి ప్రేమికులకి ఈ క్రిస్మస్ నూతన ఉత్సాహాన్ని తీసుకురావడం ఖాయమని చెప్పుకోవచ్చు.


Also Read: అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!


తెలుగు సినిమా టాప్ హీరో సూర్య కుమార్ గా ఉపేంద్ర(Upendra)నటన కూడా ఎంతగానో మెప్పిస్తుంది. కథ, కధనాలు కూడా ఎంతో ఆసక్తికరంగా సాగడంతో పాటు ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో మెప్పిస్తాయి. భాగ్యశ్రీ బోర్సే పోషించిన మహాలక్ష్మి, సాగర్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా మెస్మరైజ్ చేస్తాయి. సాంగ్స్ కొంచం ఇబ్బందిగా అనిపించినా నేపధ్య సంగీతం బాగుంటుంది. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన నటులు కూడా పెర్ఫార్మ్ విషయంలో తగ్గేదెలే అనే విధంగా చేసారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సంస్థకి తగ్గట్టే హై రేంజ్ లో ఉంటాయి. మహేష్ కుమార్ దర్శకత్వ పని తీరు కూడా మెప్పిస్తుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.