English | Telugu

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ.. ట్రైబల్ గర్ల్ గ కనిపించబోతున్న అనన్య నాగళ్ళ


అనన్య నాగళ్ళ అచ్చ తెలుగింటి అమ్మాయి.. అలాంటి అనన్య తెలుగు సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది అలాంటి అమ్మాయి ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విషయాన్నీ రీసెంట్ గా ఒక షో ఇంటర్వ్యూలో చెప్పింది. "నేను బాలీవుడ్ లో ఒక మూవీ చేయబోతున్నా. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళబోతున్నా. అదొక పీరియాడిక్ డ్రామా అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు. ఒక ట్రైబల్ గర్ల్ గా చేయబోతున్నా. ఆ ట్రైబల్ విలేజ్ లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల నుంచి తన ట్రైబల్ పీపుల్ ని ఎలా కాపాడుకుంది ఆ అమ్మాయి అన్నదే స్టోరీ. ఆ ఇన్సిడెంట్స్ నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడింది అన్నదే కథ. చాలా మంచి స్టోరీ అది. ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యే లైన్ అది.

మంచి స్క్రిప్ట్, మంచి ఫైట్స్, డాన్స్ లు కూడా ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ రిలీజ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. మేబి వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందేమో. ఈ ప్రాజెక్ట్ కోసం కొంచెం కొంచెంగా ఫైటింగ్స్ కూడా నేర్చుకున్నా." అని చెప్పింది అనన్య నాగళ్ళ. ఇక ఆరియానా ఐతే "అనన్య ముంబై ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పు నేను కూడా వచ్చి చేస్తాను అని చెప్పింది. తప్పకుండా మనిద్దరం కలిసి హిందీలో ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాం" అని చెప్పింది అనన్య. ఇక అనన్య నాగళ్ళ "మ‌ల్లేశం' మూవీతో తెలుగు ఆడియన్స్ కి ప‌రిచ‌యం అయిన తెలుగమ్మాయి. 'మ‌ల్లేశం'లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అక్క‌డ నుంచి వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మూవీ 'వ‌కీల్ సాబ్'లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇక ఈ మ‌ధ్యే 'తంత్ర' పేరుతో అంద‌రినీ భ‌య‌పెట్టింది. ఇక 'పొట్టేల్' లో నటించింది .

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .