English | Telugu

నయనతార అవుట్ త్రిష ఇన్ 

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన హీరోయిన్ త్రిష (trisha)వర్షం, నువ్వొస్తానంటే వద్దంటానా, పౌర్ణమి, కింగ్, స్టాలిన్ ,తీన్ మార్, కృష్ణ, అతడు, బుజ్జిగాడు ఇలా ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా చిరంజీవి విశ్వంభర లో చేస్తుందంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ విజయ్ లియో లో కూడా మెరిసింది. తాజాగా ఆమె నటించబోయే కొత్త సినిమా వైరల్ గా మారింది.

అమ్మోరు తల్లి (ammoru thalli)..తమిళనాట 2020 వ సంత్సరంలో రిలీజ్ అయ్యింది. అగ్ర హీరోయిన్ నయనతార (nayanthara)టైటిల్ పాత్రని పోషించింది. ఫాంటసీ కామెడీ గా తెరకెక్కగా మంచి విజయాన్నే సాధించింది. అమ్మోరు గా నయన్ నటించింది అనే కంటే జీవించిందని చెప్పవచ్చు. ఇప్పుడు అమ్మోరు తల్లికి సీక్వెల్ తెరకెక్కబోతుంది.ఈ సారి అమ్మోరు పాత్రని త్రిష పోషించబోతుందనే వార్త తమిళనాట చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు మేకర్స్ ఆమెని కలిసి పాత్ర గురించి చెప్పారని తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. మొదటి భాగాన్ని నిర్మించిన ఆర్ జె బాలాజీ నే తన స్వీయ దర్శకత్వంలో సీక్వెల్ ని నిర్మిస్తున్నాడు.మొదటి భాగంలో ఆయన క్యారక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది.

ఇక నయన్ ని కాదని త్రిష ని ఎంపిక చెయ్యడం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే మొదటి భాగంలో నయన్ ని అమ్మోరు గా తమిళ ప్రేక్షకులు స్వీకరించారు. ఇప్పుడు షారుక్ తో కలిసి చేసిన జవాన్ తో తన క్రేజ్ కూడా పీక్ లో ఉంది.దాని వల్ల పాన్ ఇండియా స్థాయిలో అమ్మోరు తల్లికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది.పైగా ప్రెజంట్ తన చేతిలో కొత్త సినిమాలు కూడా ఏమి లేవు. త్రిష మాత్రం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. విశ్వంభర తో పాటు థగ్ లైఫ్, ఐడెంటీ, రామ్ అనే నాలుగు చిత్రాలని చేస్తుంది. ఇటీవల వచ్చిన అన్న పూర్ణి వివాదం వల్లనే నయన్ కి అమ్మోరు తల్లిలో అవకాశం రాలేదనే మాటలు వినపడ్తున్నాయి.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.