English | Telugu

చిరంజీవి పై అల్లు అర్జున్ ట్వీట్.. మావయ్య నా సర్వస్వం అంటున్న మేనల్లుడు 

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పుట్టినరోజు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్టాలతోపాటు, దేశ, విదేశాల్లో ఉన్న మెగా అభిమానులు చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికగా అభిమానులు భారీ ఎత్తున ఈవెంట్ ని జరిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ హీరో శ్రీకాంత్(Srikanth)తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొని, చిరంజీవి తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

రీసెంట్ గా ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)ఎక్స్(X)వేదికగా చిరంజీవి బర్త్ డే పై స్పందిస్తు 'హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటు ట్వీట్ చేసాడు. గతంలో చిరంజీవితో కలిసి డాన్స్ చేసిన పిక్ ని కూడా అల్లు అర్జున్ షేర్ చేసాడు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)ట్వీట్ చేస్తు నేను చూసిన మొదటి హీరో మావయ్య, ఆయన జీవితం ఆదర్శం. మామ చేతి నడకే ఈ రోజు నా పయనం. మావయ్య నా సర్వస్వం. కష్టమైన సుఖమైనా కొండంత దైర్యం. మావయ్య మాటే శాసనం. ఎప్పటికి నా బలం. మీ మెగాస్టార్ మన మెగాస్టార్, నా ముద్దుల మావయ్య చిరంజీవి గారికి జన్మ దిన శుబాకాంక్షలని ట్వీట్ చేసాడు.

విక్టరీ వెంకటేష్(Venkatesth),తేజ సజ్జ, నారా రోహిత్, దర్శకుడు హరీష్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులుతో పాటు పలు రాజకీయ, వ్యాపార ప్రముఖులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారిలో ఉన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.