English | Telugu

ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకున్న నటుడుగా అల్లు అర్జున్ రికార్డు 

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెరగగా,మొన్న ఆదివారం చెన్నై వేదికగా 'కిస్సక్' సాంగ్ రిలీజ్ అయ్యింది.ఇప్పుడు ఆ సాంగ్ రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతు అల్లు అర్జున్ అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లోను సరికొత్త జోష్ ని తీసుకొస్తుంది.ఇలాంటి టైం లో మరో న్యూస్ వాళ్ళల్లో ఎనలేని ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.

తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా(forbes india magazine)2024 లో అత్యధిక పారితోషకం తీసుకున్న మొదటి పదిమంది నటుల జాబితాని విడుదల చేసింది.అల్లుఅర్జున్ మూడువందల కోట్ల రూపాయిలు తీసుకున్న నటుడుగా మొదటి స్థానంలో నిలిచాడు.దీంతో పుష్ప పార్ట్ 2 కి అల్లు అర్జున్ మూడువందల కోట్ల రూపాయల రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్నాడని అర్ధమవుతుంది.దీంతో తెలుగు హీరో స్థాయిని అల్లు అర్జున్ ఇండియన్ సినిమాకి చెప్పినట్టయ్యింది.

ఇళయ దళపతి విజయ్(vijay)లేటెస్ట్ గా వచ్చిన గోట్ మూవీకి రెండు వందల డెబ్భై ఐదు కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకొని రెండవ స్థానంలో ఉండగా,నూటయాబై నుంచి రెండు వందల కోట్ల దాకా తీసుకుంటూ షారుక్(shah rukh khan)మూడవ ప్లేస్ లో ఉన్నాడు.ఆ తర్వాత స్థానాల్లో రజనీకాంత్(rajinikanth)నూటయాబై నుంచి రెండువందల డెబ్భై కోట్లు,అమీర్ ఖాన్(amir khan)వంద నుంచి రెండువందల యాభై కోట్లు, ప్రభాస్(prabhas)వంద నుంచి రెండు వందల కోట్లు, అజిత్(ajith)నూట ఐదు నుంచి నూట అరవై ఐదు కోట్లు, సల్మాన్(salman khan)వంద నుంచి నూటయాబై కోట్లు, కమల్ హాసన్(kamal haasan)కూడా వంద నుంచి నూటయాబై కోట్లు, అక్షయ్ కుమార్(akshay kumar)అరవై నుంచి నూట నలబై ఐదు కోట్లు ఇలా తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.