English | Telugu

అల్లు కనకరత్నం స్వాతంత్ర సమరయోధురాలు.. పెళ్లికి ప్రధాన కారణం ఇదే

ఏ క్యారక్టర్ లోకైనా పరకాయప్రవేశం చేసి, సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల మనస్సులో సజీవ రూపంగా నిలిచేలా చేసే నటుల్లో 'పద్మశ్రీ అల్లురామలింగయ్య'(Allu Ramalingaiah)కూడా ఒకరు. ఆయన పేరుపై ఇండియన్ గవర్నమెంట్ ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసిందంటే, అల్లు రామలింగయ్య గారి ప్రాభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. 81 సంవత్సరాల వయసులో 2004 వ సంవత్సరంలో అల్లు రామలింగయ్య గారు చనిపోవడం జరిగింది. రీసెంట్ గా ఈ రోజు ఆయన సతీమణి కనకరత్నం(Allu kanakaratnam)గారు హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు ప్రస్తుతం 94 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలు తలెత్తడంతోనే చనిపోవడం జరిగింది.

అల్లు రామలింగయ్య, కనకరత్నం గార్లకి మన దేశానికీ స్వాతంత్రం రాక ముందే వివాహం జరిగింది. నూలు వడకడంలో కనకరత్నం గారు జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి అందుకోవడంతో పాటు,స్వాతంత్రోద్యమంలో పాల్గొందని కనకరత్నం గారిని రామలింగయ్య గారు తన జీవితంలోకి ఆహ్వానించడం జరిగింది.

కనకరత్నం గారి మరణ వార్త తెలిసిన వెంటనే 'పెద్ది' సాంగ్ షూటింగ్ నిమిత్తం మైసూర్ లో ఉన్న 'రామ్ చరణ్'(Ram Charan),అట్లీ మూవీ షూటింగ్ కోసం ముంబై లో ఉన్న 'అల్లు అర్జున్(Allu Arjun)'హైదరాబాద్ బయలుదేరారు. చిరంజీవి(Chiranjeevi)తో పాటు పలువురు సినీ, వ్యాపార,రాజకీయ ప్రముఖులు కనకరత్నం గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .