English | Telugu

అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి ఓటిటి డేట్ ఇదే 

ప్రముఖ యాంకర్, సినీ హీరో 'ప్రదీప్ మాచిరాజు'(Pradeep Machiraju)ఏప్రిల్ 11 న 'అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి'(Akkad Ammayi Ikkada Abbayi) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ప్రదీప్ కెరియర్ లో మంచి వసూలన్నీ రాబట్టింది. 'దీపికా పిల్లి'(Deepika Pilli) హీరోయిన్ గా చెయ్యగా వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్, జీ ఎం సుందర్, జాన్ విజయ్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.


ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా 'ఈటివి విన్ ' లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటిటి సినీప్రియులకి కావాల్సినంత సినీ వినోదం అందనుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో 'భైరికోన' అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో అందరు మగవాళ్లే ఉంటారు.

అలాంటి ఆ ఊర్లో చాలా సంవత్సరాలకి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమె పుట్టడంవలన వర్షాలు పడి ఆ ఊరికి ఎప్పట్నుంచో ఉన్న కరువు దూరం అవుతుంది. దీంతో అందరు 'మహాలక్ష్మీ' పుట్టిందని భావించి ఆమెని ఊరు దాటనివ్వవారు. ఆ ఊరిలోని మగవాళ్లే ఆమెని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్ద చెప్తాడు.

దాంతో ఆ ఊర్లోకి బయట మగవాళ్లని రానివ్వరు.కానీ కృష్ణ అతని స్నేహితుడు ఆ ఊరు వస్తారు. కృష్ణ, మహాలక్ష్మి కి పరిచయం జరిగి వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. మరి వాళ్ల ప్రేమ గెలిచిందా లేదా అనేదే ఈ చిత్ర కథ. మాంక్స్ అండ్ మంకీస్ ఈ చిత్రాన్ని నిర్మించగా నితిన్, భరత్ ద్వయం దర్శకత్వం వహించింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.