English | Telugu
అఖిల్.. ఆల్ రౌండర్!
Updated : Sep 21, 2015
అఖిల్‌ని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తెలుగు చిత్రసీమ కూడా.. ఈ సిసింద్రీఎంంట్రీపై ఓ కన్నేసింది. అఖిల్ శక్తి సామర్థ్యాలకు తొలి సినిమా `అఖిల్`నే ఓ వేదిక అయిపోయింది. అఖిల్ డాన్సుల్లో, ఫైట్స్‌లో, డైలాగుల్లో ఎంత పవర్ ఉందో.. అఖిల్ సినిమానే చెప్పబోతోంది. అఖిల్ కెపాసిటీని.. అఖిల్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌నీ వినాయక్ ట్రైలర్‌లోనే చూపించేశారు. ఫైట్స్‌లో అదరగొట్టాడు, డాన్సుల్లో జోష్ చూపించాడు. డైలాగుల్లో ఆకట్టుకొన్నారు. స్ర్కీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని మహేష్ బాబు కొనియాడాడు.
ఇంతకంటే ఓ డెబ్యూ హీరోకి ఇంకేం కావాలి..? అఖిల్ రూపంలో తెలుగు చిత్రసీమకు మరో పెద్ద హీరో వచ్చేశాడని మహేష్ కితాబిచ్చాడు. ఇక నాగార్జున ఆశలు, కలలు ఇవన్నీ తీరిపోయినట్టే. ట్రైలర్లో ఉన్న దూకుడు సినిమాలోనూ ఉంటే... అఖిల్ సూపర్ హిట్టవ్వడం ఖాయం. హీరోయిజాన్ని తనదైన కోణంలో చూపించే దమ్మున్న దర్శకుడు వినాయక్ తోడుగా ఉన్నాడు కాబట్టి... హిట్టుపై భరోసా మరింత పెరిగింది. మొత్తమ్మీద అఖిల్ పెర్‌ఫార్మ్సెన్స్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. వాళ్లకు దసరా పండగ ఆడియో ఫంక్షన్‌తోనే మొదలైపోయింది. ఆల్ ది బెస్ట్ అఖిల్.