English | Telugu

ఘనంగా అఖిల్ వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా మెగా కుటుంబం!

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ఓ ఇంటివాడు అయ్యాడు. జూబ్లీ హిల్స్ లోని నాగార్జున నివాసంలో నేడు తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన జైనాబ్ తో అఖిల్ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితరులు హాజరయ్యారు.

అఖిల్, జైనాబ్ ల వివాహం సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. జూన్ 8 ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియో లో రిసెప్షన్ వీరి రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు.

అఖిల్, జైనాబ్ ల నిశ్చితార్థం 2024 నవంబర్ లో జరిగింది. నేడు వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.