English | Telugu

ఆహుతి ప్రసాద్‌ కు అనారోగ్యం

సాయికుమార్ తండ్రి మనవడి పెళ్లి మరుసటి రోజే చనిపోగా, రెండ్రోజుల వ్యవధిలో సంగీత దర్శకుడు చక్రి మృతి చెందారు. ఈ వార్తలను విని టాలీవుడ్ కోలుకోక ముందే ఆహుతి ప్రసాద్ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆహుతి ప్రసాద్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఆహుతి ప్రసాద్‌ని బంధువులు, స్నేహితులు, సినీ రంగానికి చెందిన వారు పరామర్శిస్తున్నారు. టాలీవుడ్లో ఆహుతి ప్రసాద్ గొప్ప నటుడు. తన నటనా చాతుర్యంతో తను నటించిన ప్రతి సినిమాకు కీలంగా నిలిచేవారు. చందమామ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్న ఆహుతి ప్రసాద్ బెండు అప్పారావు, గులాబి, నిన్నేపెళ్లాడుతా, కొత్త బంగారు లోకం వంటి సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేశారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.