English | Telugu

అమీర్ ఖాన్‌ని టార్గెట్ చేసిన సల్మాన్


సల్మాన్ నటించిన 'కిక్' చిత్రం భారీ అంచనాలతో ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ట్రెయిలర్, పాటలకు యూట్యూబ్ లో అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. కిక్ ట్రెయిలర్ ను ఇప్పటికే 15 మిలియన్ల మంది చూశారు. అలాగే హ్యాంగోవర్, జుమ్మేకి రాత్ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే, బాలీవుడ్ లో అత్యధికంగా కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం ధూమ్-3కి, కిక్ పోటీకానుందా అనే అంశంలో బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. 533 కోట్లు వసూలు చేసిన ధూమ్ - 3 చిత్రం చైనాలో కూడా విడుదల చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కిక్ చిత్రం అంతకు మించి కలెక్షన్లు రాబట్టగలుగుతుందా లేదా తేలాలంటే వేచి చూడాల్సిందే...

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.