English | Telugu

‘అఖిల్’ కోసం వినాయక్ రాజీపడట్లేదు

వినాయక్ ‘అఖిల్’ సినిమా విషయంలో ఏమీ రాజీ పడట్లేదు. ‘అఖిల్’ సినిమాలో కూడా అదనపు ఆకర్షణలకు కొదవె లేదట. సెట్ల విషయంలో భారీ హంగామా ఉంటుందట. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ ఈ సినిమా కోసం ఏకంగా ఎనిమిది సెట్లు వేసినట్లు సమాచారం. అవన్నీ కూడా చాలా భారీగానే ఉంటాయట. పాటలతో పాటు ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ అంతా సెట్లలోనే సాగిందట. ఈ సెట్లకు కోట్లల్లోనే ఖర్చయిందని సమాచారం. ఐతే అఖిల్ కు ఉన్న క్రేజ్.. ‘అఖిల్’ సినిమా మీద ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఈ ఖర్చు పెద్ద ప్రాబ్లెం అయ్యే అవకాశమేం లేదు. ఈ సినిమాకు ఇప్పటికే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని.. నిర్మాత నితిన్ ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ తో ఉన్నాడని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రమాదమేమీ లేదన్నట్లే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.