English | Telugu

63వ జాతీయ అవార్డులు ఇవే..!

హాలీవుడ్ కు ఆస్కార్ ఎంతో, భారతదేశ సినిమాలకు జాతీయ అవార్డులు అంత విలువ. జాతీయ అవార్డు వస్తే, అది చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి దేశంలోని అన్ని వుడ్ లు. ఈ లిస్ట్ లో తమ పేరు గానీ, తమ సినిమా పేరు గానీ వస్తే, ఆ సినిమా కలెక్షన్లు రాకపోయినా కూడా కోట్ల రూపాయలు వచ్చినంత ఆనందిస్తారు మూవీ యూనిట్. తాజాగా 2015 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ అవార్డులు తెలుగవారికి కూడా గర్వకారణంగా నిలిచాయి. మన బాహుబలి, కంచె చిత్రాలకు అవార్డులు రావడమే అందుక్కారణం. ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా జక్కన్నకు అవార్డు వస్తుందని ఊహించినా, చివరకు బాజీరావ్ మస్తానీ తీసిన సంజయ్ లీలా భన్సాలీకి చేరింది. వీళ్లిద్దరికీ మధ్య ఈ కేటగిరీలో చాలా పోటీ నడించిందని జూరీ సభ్యులు చెప్పడం విశేషం. కంగనా (తను వెడ్స్ మను) ఉత్తమనటిగా, అమితాబ్ (పీకూ) ఉత్తమనటుడిగా ఎంపికయ్యారు. మే 3న జరగబోయే ఈ వేడుకల్లో అవార్డులు ఎవరెవరికి వచ్చాయో మీరే చూడండి.

ఉత్తమ చిత్రం : బాహుబలి
ఉత్తమ జనరంజక చిత్రం : భజరంగీ భాయ్‌జాన్
ఉత్తమ బాలల చిత్రం : దురంతో
ఉత్తమ దర్శకుడు : సంజయ్ లీలా భన్సాలీ (భాజీరావు మస్తానీ)
ఉత్తమ నటుడు : అమితాబ్ బచ్చన్ (పీకూ)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ సహాయ నటుడు : సముద్రఖని (విసరనై)
ఉత్తమ సహాయ నటి : తన్వీ అజ్మీ (భాజీరావు మస్తానీ)
ఉత్తమ బాల నటుడు : గౌరవ్ మీనన్ (బెన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : మహేష్ కలే (కత్యార్ కలిజిత్ గుసాలి)
ఉత్తమ నేపథ్య గాయని : మోనాలీ టాకూర్ (దమ్ లగాకే హైస్సా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) : పీకూ (జూహీ చతుర్వేది), తను వెడ్స్ మను రిటర్న్స్ (హిమన్షు శర్మ)
బెస్ట్ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్) : తల్వార్ (విశాల్ భరద్వాజ్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : బాహుబలి
బెస్ట్ లిరిక్స్ : వరుణ్ గ్రోవర్ (దమ్ లగాకే హైషా)
బెస్ట్ కొరియోగ్రఫీ : రెమో డిసౌజా (భాజీరావు మస్తానీ)
బెస్ట్ ఎడిటింగ్ : కీ.శే. కిషోర్ (విసరనై)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : ఇళయరాజా (తారా తపట్టై)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : సుధీప్ చటర్జీ (భాజీరావు మస్తానీ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ (సాంగ్స్) : ఎం. జయచంద్రన్ (ఎన్నె నింటె మొయుధిన్)

ఉత్తమ తెలుగు చిత్రం : కంచె
ఉత్తమ తమిళ చిత్రం : విసరనై
ఉత్తమ హిందీ చిత్రం : దమ్ లగాకే హైస్సా
ఉత్తమ మళయాల చిత్రం : పతెమారి
ఉత్తమ కన్నడ చిత్రం : తితి
ఉత్తమ అస్సామీ చిత్రం : కొత్తనోడి
ఉత్తమ ఒడియా చిత్రం : పహడా రా లుహా

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .