English | Telugu
రాజశేఖర్ `ఎవడైతే నాకేంటి?`కి 15 ఏళ్ళు!
Updated : Feb 9, 2022
సీనియర్ స్టార్ రాజశేఖర్ కెరీర్ లో పలు రీమేక్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `ఎవడైతే నాకేంటి?` ఒకటి. 2006 నాటి బ్లాక్ బస్టర్ మలయాళ సినిమా `లయన్` (దిలీప్, కావ్య మాధవన్) ఆధారంగా రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని వి. సముద్ర, జీవితా రాజశేఖర్ రూపొందించారు. పతాక సన్నివేశాలను విజయ్ నటించిన తమిళ చిత్రం `మధురై` (2004) స్ఫూర్తితో తెరకెక్కించడం విశేషం.
రాజశేఖర్ కి జంటగా సంవృతా సునీల్ నటించిన ఈ సినిమాలో ముమైత్ ఖాన్, భానుచందర్, రఘువరన్, కళాభవన్ మణి, కృష్ణ భగవాన్, దేవరాజ్, గిరిబాబు, రఘుబాబు, బాబుమోహన్, అన్నపూర్ణ, ఝాన్సీ, నర్సింగ్ యాదవ్, కోట శ్రీనివాసరావు, పృథ్వీరాజ్, చక్రి, రంగనాథ్, సూర్య, గుండు హనుమంతరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
Also Read:మూడో పెళ్లికైనా, సహజీవనానికైనా రెడీ అంటున్న కరాటే కల్యాణి!
చిన్నా సంగీతమందించిన ఈ చిత్రంలో ``తప్పదురా తప్పదులేరా తప్పైనా తప్పదులేరా``, ``మందార పువ్వంటి మనసున్న మారాజా``, ``ఏదో నచ్చింది``, ``సైనికుడే నాయకుడై ప్రజలకోసం వచ్చాడు``, ``ఎవడైతే నాకేంటి``... ఇలా పాటలన్నీ ఆకట్టుకున్నాయి. 2007 ఫిబ్రవరి 9న విడుదలై విజయపథంలో పయనించిన `ఎవడైతే నాకేంటి?`.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.