English | Telugu
అక్షయ్‌కుమార్ పాత్రలో మంచు హీరో?
Updated : Nov 8, 2014
మంచు హీరోల సినిమా అంటే దాదాపుగా సొంత ప్రొడక్షన్‌లోనే ఉంటుంది. బయటి నిర్మాతలు ఈ హీరోలతో సినిమాలు చేసింది తక్కువ. అయితే ఇప్పుడు మంచు హీరోకి అలాంటి ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం స్పెషల్ ఛబ్బీస్. అక్షయ్‌కుమార్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రం అక్కడ విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాదు, మంచి వసూళ్లూ దక్కించుకొంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేద్దామనుకొంటున్నారు. రీమేక్ హక్కులు ప్రశాంత్ నాన్న త్యాగరాజన్ దగ్గరున్నాయి. తెలుగులో ఈ సినిమాకి మంచు విష్ణుని కథానాయకుడిగా ఎంచుకొన్నారని తెలుస్తోంది. దర్శకుడు, మిగిలిన టీమ్ వివరాలు త్వరలో తెలుస్తాయి. విష్ణు కథానాయకుడిగా నటించిన ఎర్రబస్సు ఈనెల 14న విడుదల కానుంది. ఆ తరవాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దేవకట్టా దర్శకత్వం వహించే ఓ చిత్రంలో నటించనున్నాడు విష్ణు. దానితో పాటు స్పెషల్ ఛబ్బీస్ సినిమా రీమేక్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది.