English | Telugu

పుష్ప 3 ఐటెం సాంగ్ పై దేవిశ్రీప్రసాద్ కీలక వ్యాఖ్యలు  

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)వన్ మాన్ షో పుష్ప 2(Pushpa 2)సృష్టించిన ప్రభంజనం అందరకి తెలిసిందే.ఇటీవలే యాభై రోజుల వేడుకల్నికూడా జరుపుకున్న ఈ మూవీ,అల్లుఅర్జున్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగానే గాక తెలుగు సినిమా పరిశ్రమలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిల్చింది.హిందీలో కూడా అక్కడి హీరోలకి సాధ్యం కానీ రీతిలో రికార్డు కలెక్షన్స్ నమోదు చేసి 2000 కోట్ల క్లబ్ లోకి చేరడానికి చేరువలో ఉంది.సంక్రాంతి నుంచి కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ని కూడా యాడ్ చేసారు.

ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్(Devisri Prasad)సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.రీసెంట్ గా దేవి ఒక ఆంగ్ల ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతు పుష్ప 3 లో ఉండే ఐటెం సాంగ్ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janvi kapoor)చేస్తే బాగుంటుంది. ఆమె అద్భుతమైన డాన్సర్.శ్రీదేవి(Sridevi)లో ఉన్న గ్రేస్ ఆమెలో ఉంది.జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక.ఐటెం సాంగ్స్ హిట్ అవ్వడానికి డాన్స్ కూడా ప్రధాన కారణం.

పుష్ప 2 లో ఐటెం సాంగ్ కి శ్రీలీల(Sreeleela)పేరుని నేనే సూచించాను.శ్రీలీల అనే కాదు పూజాహెగ్డే,కాజల్,సమంత లు కూడా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే మొదటి సారి నా సంగీతంలో తెరకెక్కిన ఐటెం సాంగ్స్ లో చేసారని చెప్పుకొచ్చాడు.పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప3 ఉంటుందని పుష్ప 2 మూవీ చివరలో ప్రేక్షకులు అధికారకంగా చెప్పిన విషయం తెలిసిందే.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.