English | Telugu
టీడీపీ టార్గెట్‌గా వైసిపి బీజేపీ కలిసి భారీ స్కెచ్..
Updated : Aug 3, 2020
ఈ వరుస ఘటనలను, పరిస్థితులను నిశితంగా పరిశీలించిన విశ్లేషకులు మాత్రం గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడం పై ఏమాత్రం ఆశర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఎపిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ మూడు రాజధానుల అంశం గురించి కేంద్రానికి ముందుగానే తెలుసునని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బీజేపీతో పొత్తుకు ముందు అమరావతి విషయంలో అయన తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న తరువాత కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల పోరాటంలో తోడుగా ఉంటానని పవన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అమరావతి ని తరలించకుండా చూడాలని షరతుతోనే బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఐతే ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల రాజీనామా కోరడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఐతే ఇది కూడా కేంద్రం పొలిటికల్ జిమ్మిక్ లో భాగమేనని విశ్లేషకుల వాదన.
ఇది ఇలా ఉండగా హై కోర్టును తరలించడం అంత తేలికైన విషయం కాదు. దీనికి అటు కేంద్ర ప్రభుత్వం లోని నిమిద శాకాహాలతో పాటు.. సుప్రీమ్ కోర్టు అనుమతి కూడా అవసరమే. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం అనుమతి లేకుండా సీఎం జగన్ అంత ధైర్యంగా అడుగులు వేసే అవకాశం అసలు లేదని విశ్లేషకుల అంచనా. దీనికి తోడు తాము ఏ పని చేసినా కేంద్ర పెద్దలకు చెప్పే చేస్తున్నామని స్వయంగా వైసిపిలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఈ దెబ్బతో రాష్ట్రంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయడమే వైసిపి, బీజేపీ లక్ష్యమని.. ఐతే తెలిసి కానీ తెలియక కానీ పవన్ కూడా ఇందులో భాగస్వామి అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.