ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ఫొటోలను అసభ్యకరంగా వాట్సప్‌లో పెట్టాడని ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆ మహిళ వైసీపీ నేతను చెప్పుతో కొట్టింది. దీంతో యర్రగొండపాలెం పీఎస్ దగ్గర ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అసలేం జరిగింది..? వాట్సాప్‌లో పెట్టిన ఫొటో సంగతేంటి..? ఆ వైసీపీ నేత ఎవరు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.