English | Telugu
ఆవిడ ఏమి అడిగారు, ఈవిడ ఏమి ఇచ్చారు?
Updated : Mar 26, 2020
లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ.. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు కానీ, మధ్య తరగతి గురించి మాట్లాడలేదు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు పేర్కొన్నారు. నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్ యోజన్ ద్వారా మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనంవీటితో పాటు కేజీ పప్పు సరఫరా చేస్తారు.పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామని కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు, కానీ, ఇక్కడా ఎక్కడా మధ్య తరగతి ని ఆమె స్పృశించలేదు. పీఎం కిసాన్ బీమా కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్న కేంద్రం ఇప్పుడు మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ, ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి, జన్‌ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు అండ చేయటం, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు లాంటి చర్యలను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుందనీ,90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు ఉంటుందనీ కూడా ఆమె చెప్పుకొచ్చారు. తమ పీఎఫ్ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు.
ఇవన్నీ సరే, దిగువ మధ్యతరగతి, ఓ మోస్తరు మధ్యతరగతి ప్రజల ఈ ఎం ఐ కష్టాల గురించి చిన్న పాటి ఊరట పొందేలా, ఈ ఎం ఐ ల వసూలు ఆరు నెలల పాటు వాయిదా వేయాలని, వాటి పై వడ్డీలను బ్యాంకులు మాఫీ చేయాలనీ కోరిన సోనియా గాంధీ విన్నపాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్ధిక మాత్రం పట్టించుకోకపోవటం మాత్రం మధ్య తరగతి ప్రజానీకానికి నిరాశ, నిస్పృహ కలిగించే విషయమే.