English | Telugu
ట్రంప్ కు మండింది.. చైనాకు మూడింది
Updated : Jul 1, 2020
ఐతే ట్రంప్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం లో కొంత న్యాయం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో నే కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా ఒకటి. అక్కడ దాదాపు 27 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ బారిన పడిన వారందరికీ ట్రీట్‌మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడిందే కాకుండా అటు హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ పిపియి కిట్లు, మందులు ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్న పరిస్థితి. అంతే కాకుండా సాధారణ పరిస్థితులు లేక పోవడం తో ఆర్థికంగా కూడా ఎక్కడ లేని నష్టం జరుగుతోంది. దీనికంతటికి చైనాయే కారణం అని ట్రంప్ ఫైర్ అవుతున్నారు.
దీనికి తోడు తాజాగా చైనాలో మరో భయంకరమైన G4 EA H1N1 అనే వైరస్ వెలుగులోకి రావడంతో... ప్రపంచ దేశాలన్నీ ఇపుడు "చైనా వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచానికి చావొచ్చింది" అని ఫైర్ అవుతున్నారు. ఈ కొత్త వైరస్ పందుల నుంచే మనుషులకు సోకుతోందాని తెలుస్తోంది. మరో పక్క పొరుగు దేశం ఐన భారత్ తో సరిహద్దులో కుట్రలు పన్నుతున్న చైనాపై దాదాపు ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాకుండా ఒక్క పాకిస్తాన్ తప్పించి తన చుట్టూ ఉన్న దేశాలతో చైనా ఏదో ఒక కారణం తో శత్రుత్వాన్ని పెంచుకుంటోంది.
తాజాగా అసలు చైనాలో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందో తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధులు చైనాకు వెళ్లి పరిశోధించ బోతున్నారు. ఒక వేళ ఆ పరిశోధనలో కరోనా వైరస్‌ని చైనా స్వయంగా ల్యాబ్‌లో తయారుచేసిందని తేలితే మాత్రం ప్రపంచ దేశాలు చైనాపై చాలా పెద్ద ఎత్తున పరిహారం కోరుతూ కేసులు వేసే అవకాశం ఉంది. ఇక అమెరికా ఐతే యుద్ధం వంటి తీవ్ర నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్య పోనవసరం లేదు. మరో పక్క చైనా మాత్రం ఈ వైరస్‌ని అమెరికాయే సృష్టించిందని ఆరోపిస్తోంది. ఏది ఏమైనా చైనా కు ఒక వైరస్‌ల దేశంగా మాత్రం కొత్తగా గుర్తింపు వచ్చింది.