English | Telugu

2020 ఫిబ్రవరి నుండి ఆ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు

2020 ఫిబ్రవరి నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మీద నడిచే కొన్ని స్మార్ట్ ఫోన్ లకు ఇక పై వాట్సప్ నిలిచిపోనున్నట్లు ప్రకటించింది సంస్థ. విండోస్ ఫోన్లకైతే పూర్తిగా ఈ సపోర్టు నిలిచిపోనుంది. వీటికి సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లో తెలిపింది. అంతేకా కుండా ఆయా స్మార్ట్ ఫోన్లలో కొత్త వాట్సప్ ఖాతాను సృష్టించటం కానీ దాన్ని వెరిఫై చేసే అవకాశం కూడా ఉండదు. ఇంతకీ ఏ ఏ స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ నిలిచిపోతుందంటే ఐవోఎస్ 8 లేదా దానికంటే పాత ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేసే ఆపిల్ ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ పనిచేయదు. అప్పటి వరకూ వీరు ఈ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ ను ఉపయోగించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ 2,3,7 అంతకన్నా పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మీద నడిచే అన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఫిబ్రవరి 1,2020 వరకు మాత్రమే ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేస్తుందనీ తర్వాత పని చేయదని సంస్థ ప్రకటించింది. ఒకవేళ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ల పై మాత్రమే నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ వాడాలనుకుంటే ఒకటే దారి, ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లలో ఇన్ స్టాల్ అయిన వాట్సాప్ ను అప్ డేట్ చెయ్యకూడదు, అన్ ఇన్ స్టాల్ చేయకూడదు, అప్పుడు మాత్రమే మీరు ఈ ఫోన్లలో వాట్సాప్ ను వాడగలరు. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే ఫోన్లన్నింటికీ ఈ సపోర్టు నిలిచిపోనుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫిబ్రవరి 1,2020 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తూ వుంటే విండోస్ ఫోన్లకు కాస్త ముందుగానే అంటే 2019 డిసెంబర్ 31 తరువాత వీరికి వాట్సప్ అప్ డేట్స్ రావు. జియో ఫోన్ వినియోగదారులకు ఈ అప్ డేట్స్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టం 251 పైన నడిచే అన్ని మొబైల్స్ లోనూ వాట్సప్ పనిచేయనుంది. వీటిలో జియో ఫోన్ జియో ఫోన్ 2 కూడా ఉన్నాయి కాబట్టి ఆయా ఫోన్లలో వాట్సప్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.