English | Telugu
టీటీడీ సంచలనం.. గరుడ వారధి ప్లైఓవర్ కు తాత్కాళిక బ్రేక్!
Updated : Feb 14, 2020
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. తాజాగా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో టిటిడి పాలక మండలి కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గరుడ వారధి ప్లైఓవర్ నిర్మాణం పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని బోర్డు నిర్ణయించింది. అయితే గరుడ వారధి ఫ్లైఓవర్ డిజైన్ ఫైనల్ కాలేదని పెద్దలు ఆగమ శాస్త్ర సలహాలు తీసుకుంటామన్నారు బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఫ్లై ఓవర్ పై ఇప్పుడే నామాలు పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు. ఫైనల్ గా టీటీడీ బోర్డులో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు వైవి సుబ్బారెడ్డి.
అదేవిధంగా ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో బసంత్ కుమార్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీషా పాల్గొన్నారు. కార్పొరేషన్ కు టీటీడీ చెల్లించాల్సిన 80 కోట్ల బకాయిలపైనా చర్చ జరిగింది. గరుడ వారిది పిల్లర్ల పై నామాలు వేయడం వల్ల భక్తిభావం పెరుగుతుందనీ ఫ్లై ఓవర్ కు ప్రత్యేకత ఉండాలనే లక్ష్యం తోనే నామాలు వేశామని గిరీషా చెప్పారు.
అంతేకాకుండా అనేక విభేదాలతో నడుస్తున్న గరుడ వారధి నిర్మాణానికి ఎట్టకేలకు బ్రేక్ పడినట్లైంది. దాదాపుగా 640 కోట్ల రూపాయలతో తిరుపతిలో నిర్మాణం చేపట్టిన గరుడ వారిది పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సుమారు 425 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన టిటిడి ఇప్పటి వరకు దాదాపుగా 45 శాతం పనులు పూర్తయినా కూడా ఇప్పటికీ ఒక్క పైసా కూడా టీటీడీ చెల్లించలేదని సమాచారం అందుతుంది. టీటీడీ నిధులు ఖర్చు చేయడానికి ముందు నుంచి కొంత మంది భక్తులు తప్పుపట్టడం కోర్టుకెళ్లడంతో.. గరుడ వాది నిర్మాణం ఒక వివాదాస్పదం గానే కొనసాగుతోంది. అయితే దీనిపైన వేసిన నామాలు పైన విషయం కూడా వివాదాస్పదంగా మారిపోయే పరిస్థితి ఉందని తెలుస్తోంది.