English | Telugu

దసరాలో బస్ లు ఆపితే డిస్మిస్ తప్పదు..

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ మధ్య గురువారం జరిగిన చర్చలలో‌ దసరా ముందు బస్సు లను ఆపుతామంటే డిస్మిస్ చేయక తప్పదని అధికారులు హెచ్చరించారు. ఎస్మా అస్త్రాన్ని సందిస్తామని కూడా చెప్పారు. దీనిపై కార్మిక నేతలు స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు గతంలోనూ ఎదురయ్యాయని అన్నారు. డిస్మిస్ చేసినా, ఎస్మాను ప్రయోగించినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇరువర్గాలూ పెట్టి వీడకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. కార్మిక నేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఐదవ తేదీ నుంచి తల పెట్టిన సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఒక పక్క తమను చర్చలకు ఆహ్వానించి, మరోపక్క బస్సులను నడపడానికి కమిటీ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్మా ప్రయోగించినా, డిస్మిస్ లు చేసినా భయపడకుండా సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గురువారం నాటి చర్చలు విఫలమైన నేపథ్యంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య మళ్లీ చర్చలు జరగయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వైద్య, ఆరోగ్య ఉద్యోగులు మద్దతు పలికారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షు యాదానాయక్ తదితరులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని త్రిసభ్య కమిటీ సభ్యుడు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హెచ్చరించారు. సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్ చేస్తామన్నారు. అవసరమైతే ఎస్మాను ప్రయోగిస్తామని హెచ్చరించారు. జేఏసీ నేతలు చెప్పిన ఇరవై ఆరు డిమాండ్ లను సానుకూలం గా పరిష్కరిస్తామని చెప్పిన కార్మిక నేతలు వినడం లేదని సోమేష్ కుమార్ ఆరోపించారు. తెలంగాణలో దసరా పండుగ చాలా ప్రధానమైనదని ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం సమంజసం కాదని చెప్పామన్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పామని కె రామకృష్ణా రావు తెలిపారు. మరోసారి కార్మిక జేఏసీతో చర్చలు జరుపుతామని అన్నారు.

కార్మికుల సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయంగా ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టింది. జిల్లాల్లో అందుబాటులో ఉన్న క్యాజువల్ కాంట్రాక్టు సిబ్బంది రిటైర్డు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని డిపోల మేనేజర్లు ఈవీఎంలకు అంతర్గత ఉత్తర్వులిచ్చింది. సంస్థల్లో ఉన్న అన్ని అద్దె బస్సులు నడిచేలా చూడాలని చెప్పింది. మరో పక్క ప్రైవేటు బస్సులను స్టేజీ క్యారేజీలుగా నడిపించాలని రవాణా శాఖ ఆర్టీసీ నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం ఎర్రమంజిల్ కార్యాలయంలో రవాణా శాఖాధికారులు ఆర్టీసీ అధికారులతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ పేరుపేరుగా సమీక్షలు నిర్వహించారు. ఆర్టీసీలో ప్రస్తుతమున్న రెండు వేల మూడు వందల పైగా అద్దె బస్సులన్ని నడిచేలా చూడాలని ఆదేశించారు. వీటికి అదనంగా ప్రైవేటు బస్సులు, స్కూలు బస్సులను కూడా నడపాలని సూచించారు. మరో పక్క హైదరాబాద్ లో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల ట్రిప్పులను పెంచాలంటూ రైల్వే అధికారులను కోరాలని సూచించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ మధ్య గురువారం జరిగిన చర్చలలో‌ దసరా ముందు బస్సు లను ఆపుతామంటే డిస్మిస్ చేయక తప్పదని అధికారులు హెచ్చరించారు. ఎస్మా అస్త్రాన్ని సందిస్తామని కూడా చెప్పారు. దీనిపై కార్మిక నేతలు స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు గతంలోనూ ఎదురయ్యాయని అన్నారు. డిస్మిస్ చేసినా, ఎస్మాను ప్రయోగించినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇరువర్గాలూ పెట్టి వీడకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. కార్మిక నేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఐదవ తేదీ నుంచి తల పెట్టిన సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఒక పక్క తమను చర్చలకు ఆహ్వానించి, మరోపక్క బస్సులను నడపడానికి కమిటీ సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్మా ప్రయోగించినా, డిస్మిస్ లు చేసినా భయపడకుండా సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.