English | Telugu

ఎరువుల కొరత రానివ్వం.. కేంద్రమంత్రి హామి

తెలంగాణ రాష్ట్రానికి కావల్సిన ఎరువులను అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సదానందగౌడ హామి ఇచ్చారు. ఈ మేరకు ఆయనను ఢిల్లీలో కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ వానాకాలానికి ఇచ్చిన మాటప్రకారం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తప్పకుండా సరఫరా చేస్తాం.. దానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి చెప్పారని నిరంజన్ రెడ్డి మీడియాతో చెప్పారు.

సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానంద గౌడను కలిసి తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. తెలంగాణలో పూర్తి అయిన ప్రాజెక్టుల కారణంగా ఆయకట్టు బాగా పెరిగిందన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. జులై నెలాఖరు నాటికి రావాల్సిన 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందజేస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు.దేశాన్ని కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్న తరుణంలో వ్యవసాయానికి కరోనా నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడం వల్లనే ఈ రోజు ఆహారధాన్యాలకు కొరత లేదన్నారు.