English | Telugu
బత్తాయి, నిమ్మ ఎగుమతులు చేసే వాహనాలపై ఆంక్షలు లేవు!
Updated : Mar 28, 2020
మొత్తం జిల్లాలో 46 వేల 800 ఏకరాలలో బత్తాయి తోటలు విస్తరించి ఉండగా అందులో 30 వేల ఎకరాల పై చిలుకు బత్తాయి కాపుకొచ్చిందన్నారు.మొత్తం మీద ఈ సీజన్ లో ఒక్క బత్తాయి 43 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్న అంచనా. అదే విదంగా 16 వేల విస్తీర్ణంలో వేసిన నిమ్మ ఇప్పటికే 8,800 ఎకరాల్లో సాగుకు వచ్చిందన్నారు.52 వేల 400 మెట్రిక్ టన్నుల నిమ్మ పంట తో పాటు 5,300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన పుచ్చకాయ దాదాపు లక్షకు పై చిలుకు మెట్రిక్ టన్నుల పంట దిగుబడికి సిద్ధంగాఉంది. ఇప్పటి వరకు జిల్లాలోని బత్తాయి, నిమ్మ, పుచ్చకాయ పంటను ఇక్కడి రైతాంగం ట్రేడర్స్ ద్వారా హైదరాబాద్, ఢిల్లీ లతో పాటు గుజరాత్ కు ఎగుమతి చేసేవారని అయితే కరోనా వైరస్ తో ఏర్పడ్డ పరిస్థితులు రవాణా రంగం మీద చూపడంతో రైతుల్లో ఆందోళన మొదలైందని సంగీత లక్ష్మి మంత్రి దృష్టికి తీసుకు రాగ జాతీయంగా ఈ తరహా ఎగుమతులు చేసే వాహనాలపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేసినందున ఎటువంటి ఇబ్బంది ఉండబోదన్నారు.