English | Telugu
సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపిన టీడీపీ, బీజేపీ!!
Updated : Feb 3, 2020
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిమిత్తం పార్టీలు తమ ఎమ్మెల్సీల పేర్లు పంపాలని షరీఫ్ ఇటీవల సూచించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు తమ సభ్యుల పేర్లను పంపాయి.
టీడీపీ నుంచి మూడు రాజధానుల బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ కోసం.. నారా లోకేష్, అశోక్ బాబు, తిప్పేస్వామి, బీటీనాయుడు, సంధ్యారాణి పేర్లు..
సీఆర్డీఏ రద్దు బిల్లు కోసం.. దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు పేర్లు పంపారు.
బీజేపీ నుంచి మూడు రాజధానుల బిల్లు కోసం మాధవ్, సీఆర్డీఏ రద్దు బిల్లు కోసం సోము వ్రీరాజు.
పీడీఎఫ్ నుంచి మూడు రాజధానుల బిల్లు కోసం కేఎస్ లక్ష్మణరావు, సీఆర్డీఏ రద్దు బిల్లు కోసం ఇళ్ల వెంకటేశ్వరరావు.