English | Telugu
స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్
Updated : Sep 1, 2020
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10శాతం మంది పోలీసులు కరోనా బారిన పడ్డారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారినపడ్డారు. సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయిన రిపోర్టు మంగళవారం వచ్చింది. దాంతో గత వారం రోజుల్లో తనను కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్ లో రవీంద్ర ఉంటారు.
కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందువరుసలో నిలబడిన పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధకార్మికులు, జర్నలిస్టులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఆరువేలమంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వైద్యసిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కరోనా బారిన పడిన వైద్యసిబ్బందికి, వారి కుటుంబ సభ్యుల చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రిలో 50బెడ్స్ కూడా ప్రత్యేకంగా కేటాయించారు.