English | Telugu
సింహాచలం దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
Updated : Oct 14, 2020
దేవాదాయ కమిషనర్ పి అర్జున రావు బుధవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో, నరసింగ రావును సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేసారు. దేవస్థానంలో జరుగుతున్న అనేక అవకతవకలకు కారణమైన నరసింగ రావు, అనేక విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, ముఖ్యంగా, దేవస్థానానికి సంబంధించిన 13 ఎకరాల భూమి విషయంలో హై కోర్ట్ యధా స్థితి (స్టేటస్ కో) ఇచ్చినప్పటికీ ఆ భూమి ఇతరులు చదును చేయడానికి నరసింగ రావు చట్ట విరుధంగా అది ఆక్రమించినవారికి సాయంచేస్తున్నదని తన దృష్టికి వచ్చినందున నరసింగ రావు ను వెంటనే సస్పెండ్ చేస్టజున్నట్లు ప్రకటించడం జరిగిందని కమిషనర్ తెలియజేసారు.
ఈ సస్పెన్షన్ ఆయనపై ఎంక్వైరీ అయ్యేవరకు కొనసాగుతుందని, తదుపరి అవసరమైన చర్యలు ఆ దేవాలయ ఎక్క్సిక్యూటివ్ ఆఫీసర్ తీసుకుంటారని కమిషనర్ తెలియజేసారు. నరసింగ రావు ప్రస్తుతమున్న పోస్టులో కొనసాగితే ఆయనపైనే జరుగుతున్న ఎంక్వైరీ ఏ కాకుండా, దేవాలయ భూములు ఫై జరుగుతున్న ఎంక్వైరీలలో కూడా అయన జోక్యం చేసుకునే అవకాశం ఉండడంవల్ల ఆయనను వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందని అర్జున్ రావు తెలియజేశారు.