English | Telugu
బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్! అమిత్ షానే సంధానకర్తన్న రేవంత్ రెడ్డి
Updated : Nov 26, 2020
పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎంలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్ లపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదని తెలిపారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదన్నారు. ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి.