English | Telugu
హత్రాస్ భాదితురాలి ఇంటికి రాహుల్.. సంచలన విషయాలు బయటపెట్టిన సోదరుడు
Updated : Oct 3, 2020
మరోవైపు, హత్రాస్ లోకి మీడియాను అనుమతించిన నేపథ్యంలో.. మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన విషయాలు చెప్పారు. మృతురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజు దహనం చేసిన శరీరం ఎవరిదో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అది తన సోదరి మృతదేహమే అయితే.. అలా రహస్యంగా దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తమ సోదరిని చివరిసారి చూడాలని పోలీసులు, అధికారులకు తాము మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా ఇవ్వాలని అడిగితే.. అది ఇంగ్లీషులో ఉంటుందని, మీకు అర్థం కాదని చెప్పారని మండిపడ్డారు. తమను ఇంటి నుంచి కదిలేందుకు కూడా అనుమతించడం లేదని, తాము ఎంతో భయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.