English | Telugu

ప్రగతి భవన్ వద్ద ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. "ముఖ్యమంత్రి మేలుకో ప్రజల ప్రాణాలు కాపాడు బతుకుదెరువు నిలబెట్టు" అనే నినాదంతో ప్రగతి భవన్ వద్ద నల్ల బెలూన్లతో నిరసనకు పిలునిచ్చిన ప్రొఫెసర్ కోదండరాం ను ప్రగతి భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రొఫెసర్ కోదండరాం తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి , pow నేత సంధ్యతో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేసి వేరు వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఐతే మీడియాతో మాట్లాదిన ప్రొఫెసర్ కోదండరాం ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, త్వరలో ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలియజేస్తామని అయన కెసిఆర్ ను హెచ్చరించారు. అమెరికాలో వైట్ హౌస్ ముందు కూడా నిరసన తెలియజేసే పరిస్థితి ఉందని, కానీ తెలంగాణాలో ఆపరిస్థితి లేదని అయన అన్నారు.