English | Telugu

చిక్కుల్లో రతి నిర్వేదం హీరోయిన్.. యువతని తప్పుదోవ పట్టిస్తోందని పోలీస్ కేసు

ప్రముఖ హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ 'శ్వేతామీనన్'(Swetha Menon)సినీ నేపధ్యం ఎంతో ఘనమైనది. మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టి' కి జోడిగా, 1991 లో వచ్చిన 'అనశ్వరం' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన శ్వేత, ఆ తర్వాత మలయాళ, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో కలుపుకొని ఇప్పటి వరకు సుమారు వంద సినిమాల వరకు చేసింది. వీటిల్లో హీరోయిన్ గా చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అవార్డుల పరంగా చూసుకుంటే 2009 ,2011 కి సంబంధించి మలయాళ రాష్ట్ర ప్రభుత్వం చేత బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని సొంతం చేసుకుంది. ఫిలిం ఫేర్, సైమా అవార్డ్స్ తో పాటు ఇతర అవార్డ్స్ ని ఎన్నింటినో గెలుచుకున్న శ్వేత, మలయాళంలో తెరకెక్కిన అనేక సీరియల్స్, షోస్ ద్వారా కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.

రీసెంట్ గా శ్వేతా మీనన్ పై మార్టిన్ అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా పోలీసులు పట్టించుకోవడం లేదని కోర్టుని ఆశ్రయించాడు. ఈ విషయంపై మార్టిన్ మాట్లాడుతు శ్వేతా మీనన్ అడల్ట్ చిత్రాల్లో నటిస్తు యువతని తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో కూడా ఆమె మీడియాతో మాట్లాడుతు, డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని చెప్పిందని మార్టిన్ తెలిపాడు.

శ్వేతా మీనన్ శృంగార పరంగా చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, 2011 లో వచ్చిన 'రతినిర్వేదం'(RathiNirvedam)మళయాళంతో పాటు ఇతర భాషల్లోను రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా రొమాన్స్ సన్నివేశాల్లో శ్వేతా మీనన్ నటన ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది. నేటికీ సదరు సన్నివేశాలు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని రాబడతాయి. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచిన శ్వేతా, తెలుగులో 'భానుచందర్' స్వీయ దర్శకత్వంలో 1995 లో వచ్చిన 'దేశద్రోహులు'లోను హీరోయిన్ గా చేసింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.