English | Telugu

సరిహద్దుల్లో పాక్ రహస్య డ్రోన్ కూల్చివేత

భారత్-చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌ రహస్యంగా డ్రోన్ తో ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. జమ్ముూకశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్ సెక్టారులోని రథువా వద్ద శనివారం ఉదయం పాక్ కి చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. రహస్యంగా ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ కు చెందిన జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశారు. సరిహద్దుల్లో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించేందుకే పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.