English | Telugu
మానవత్వం మరిచి ఎస్సీ రైతులకి సంకెళ్లు వేసి జైళ్లో పెట్టారు: నారా లోకేష్
Updated : Nov 27, 2020
"దాడులు దౌర్జన్యాలెన్నో భరిస్తూ ఎంతకాలమైనా వెన్నుచూపని అమరావతి పరిరక్షణ ఉద్యమందే అంతిమ విజయమని లోకేష్ స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నం పెట్టే అన్నదాతలు భూతల్లిని రాజధాని కోసం చేసిన త్యాగాలను లోకేష్ కొనియాడారు. అమరావతిని చంపేసే కుట్రల్ని నిరసిస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లని గుర్తు చేశారు. తమ త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రజారాజధానికి సమాధి కట్టొద్దంటూ నినదించిన కృష్ణాయపాలెం రైతులు, మూడుముక్కలాటకి మద్దతుగా వచ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవడమే నేరంగా పరిగణించి, ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసు జగన్ రెడ్డి పెట్టించారని లోకేష్ ధ్వజమెత్తారు.